ముంబయికి భారీగా వలస వచ్చిన ఫ్లెమింగోలు

గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికం

flemingo birds in mumbai
flemingo birds in mumbai

ముంబయి: లాక్‌డౌన్‌ కారణంగా జన సంచారం లేకపోవడంతో ముంబయి కి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులు స్వేచ్చగా విహరిస్తున్నాయి. దేశంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో వన్య మృగాలు , పక్షులు స్వేచ్చగా తిరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ముంబయికి బారీగా ఫ్లెమింగొలు వలస వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఇపుడు 25 శాతం ఎక్కువగా వచ్చాయని బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటి తెలపింది. ఈ ఏడాది సుమారు 1.5 లక్షల వరకు ఫ్లెమింగోలు వచ్చిఉంటాయని అంచని వేస్తున్నారు. కాగా వీటికి సంబందించిన ఫొటోలను పలువురు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/