రేపు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ..

draupadi murmu visit to hyderabad tomorrow

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారం రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటయించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈమె రేపు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబవుతుంది. వారం రోజులపాటు ఇక్కడే బస చేయనున్నారు. దీంతో బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. విష సర్పాలు, కీటకాలు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

మూడేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్ కు రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్ లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి ఆలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామం అనంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఇక ఈనెల 27న నారాయణగూడ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి సమావేశం కానున్నారు.