ఈ రెండు కొత్త స్కీమ్‌ల‌ వ‌ల్ల పెట్టుబ‌డుల రంగం విస్త‌రిస్తుంది

YouTube video
PM Modi launches RBI Retail Direct Scheme & Reserve Bank- Integrated Ombudsman Scheme

న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేడు వినియోగ‌దారుల కేంద్రీకృత‌మైన‌ రెండు ఆర్బీఐ స్కీమ్‌ల‌ను ప్రారంభించారు. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్‌తో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్‌-ఇంట‌గ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ.. క‌స్ట‌మ‌ర్ కేంద్రీకృత‌మైన ఈ రెండు కొత్త స్కీమ్‌ల‌ వ‌ల్ల పెట్టుబ‌డుల రంగం విస్త‌రిస్తుంద‌న్నారు. దీంతో మూల‌ధ‌న మార్కెట్ మ‌రింత సులువు అవుతుంద‌ని, ర‌క్ష‌ణాత్మ‌కంగా మారుతుంద‌న్నారు.

ప్ర‌భుత్వ సెక్యూర్టీ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు ఈ కొత్త స్కీమ్‌ల‌కు చిన్న ఇన్వెస్ట‌ర్ల‌కు డైరెక్ట్ యాక్సిస్ ఉంటుంద‌ని మోదీ తెలిపారు. స్థిర‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ కోసం బ‌ల‌మైన బ్యాకింగ్ వ్య‌వ‌స్థ అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు. సుల‌భ‌త‌ర‌మైన పెట్టుబ‌డుల‌తో పాటు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై సామాన్యుల న‌మ్మ‌కం చాలా కీల‌క‌మ‌న్నారు. గ‌డిచిన ఏడేళ్ల‌లో ఎన్పీఏల‌ను చాలా పార‌ద‌ర్శ‌కంగా చూశామ‌ని, తీర్మానాలు.. రిక‌వ‌రీల‌పై దృష్టిపెట్టామ‌ని, ఈ సంస్క‌ర‌ణ‌ల‌తో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మ‌వుతోంద‌న్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/