రజనీకాంత్‌ ఇంటి వద్ద ఆసక్తిగా చూస్తున్న అభిమానులు

నేడు తన మనసులోని మాటను బయటపెడతానన్న రజనీ

rajinikanth
rajinikanth

చెన్నై: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈరోజు తన మనసులో మాటను చెబుతానన్ని చేసిన వ్యాఖ్యలతో ఆయన ప్రకటన కోసం ఇటు అభిమానులు, అటు రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఈ ఉదయం నుంచే చెన్నై, పోయెస్ గార్డెన్ లోని రజనీ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఆయన చెప్పబోయే విషయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ వారం రోజుల క్రితం రజనీ మక్కల్ మండ్రం (ఆర్ఎంఎం) జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు. నేడు మరోమారు వారితో భేటీ కానుండడంతో అందరి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. వారితో భేటీ తర్వాత ఖతలైవాగ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా కార్యదర్శులతో భేటీ అనంతరం రజనీకాంత్ విలేకరులతో మాట్లాడతారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాడు సిద్ధమవుతున్న వేళ.. రజనీ తన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్త్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/