చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన హరీష్ రావు

హైదరాబాద్: కరోనా తగ్గిందని నిర్లక్ష్యం చేయకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోని , ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ నియోజవర్గంలో 12 -14 సంవత్సరాల వయస్సు పిల్లలకి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి ఈ నేపథ్యంలో మాట్లాడుతూ… ఇప్పటికి ఇంకా పూర్తిగా కరోనా తగ్గలేదని , ఇక రాదని అనుకోవడం పొరపాటు అన్నారు. 12 నుండి 14 లోపు పిల్లలకి వ్యాక్సిన్ అందిచడం ఆనందంగా ఉంది అన్నారు. ఆ వ్యాక్సిన్ హైదరాబాద్ కేంద్రంగా తయారవ్వడం గర్వాంగా ఉందన్నారు. కరోనా ప్రభావం తగ్గాలంటే ఏకైక మార్గం వ్యాక్సినే అని చెప్పారు. చిన్నారుల అందరికి వ్యాక్సిన్ అందించడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే 60 ఏళ్లు దాటినా వారికీ మర్చి 16 నుండి బుస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులు

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/