పంజాబ్ సీఎంగా భ‌గ‌వంత్ మాన్ ప్ర‌మాణ స్వీకారం

bhagwant-mann-sworn-in-as-punjab-chief-minister

చండీగఢ్‌: పంజాబ్‌ కొత్త సీఎంగా భగవంత్‌ సింగ్‌ మాన్‌ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాజధాని చండీగఢ్‌లో కాకుండా భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కాడ్‌ కలన్‌లో పదవీ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. భగత్‌సింగ్ కలలు కన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేస్తామన్నారు భగవత్‌ మాన్‌. సంప్రదాయాలకు భిన్నంగా స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖతర్ కలన్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఆ గ్రామమంతా పసుపు మయంగా మారింది. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు పసుపు రంగులో ఉండే తలపాగాలు, దుప్పటాలు ధరించి రావాలన్న భగవంత్ పిలుపునకు భారీ స్పందన వచ్చింది. వేదికను కూడా పసుపు వర్ణంలోనే ఏర్పాటుచేశారు. విప్లవానికి ప్రతీకగా భగత్ సింగ్ ఈ రంగు తలపాగాలను ధరించేవారు. 1970 తర్వాత సీఎం పగ్గాలు చేపడుతున్న చిన్న వయస్కుడు భగవంత్ మాన్ (48) కావడం విశేషం.

ఖతర్ కలాన్‌కు బసంతి రంగులు వేద్దాని భగవంత్ మాన్ తన ప్రమాణ స్వీకారానికి పంజాబ్ ప్రజలను ఓ వీడియో మెసెజ్‌లో ఆహ్వానించారు. బుధవారం జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర ప్రజలందర్నీ ఆహ్వానించారు. ఒక్క భగవంత్‌ సింగ్‌ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లేదు.. మొత్తం 3 కోట్ల పంజాబీ ప్రజలు ముఖ్యమంత్రులు కానున్నారని భగవంత్ సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా షహీద్‌ భగత్‌ సింగ్‌ కలలుగన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/