కరోనాను టెస్ట్‌ మ్యాచ్‌తో పోల్చిన గంగూలీ


ప్రమాదకరమయిన పిచ్‌పై టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నట్టు ఉంది: గంగూలీ

sourav ganguly

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా గురించి భారత మాజీ కెప్టెన్‌, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తనదైన శైలిలో అభివర్ణించాడు. కరోనా విపత్తును క్రికెట్‌ ఆటతో పోల్చాడు. కరనా సంక్షోభాన్ని చూస్తుంటే ప్రమాదకరమైన పిచ్‌పై టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నట్టు ఉంది. బంతి దూసుకువస్తోంది. స్పిన్‌ కూడా తిరుగుతోంది. బ్యాట్స్‌మెన్‌ చిన్నతప్పు చేసినా అవుట్‌ కావడం ఖాయం అనే విధంగా ఉంది. ఈ మ్యాచ్‌ గెలవాలంటే బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయాల్సిందే, వికెట్‌ను కాపాడుకోవాల్సిందే అంటూ తనదైన శైలిలో చెపుకొచ్చాడు. తాజాగా ఫీవర్‌ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్న 100 అవర్స్‌ 100 స్టార్స్‌ అనే కార్యాక్రమంలో భాగంగా గంగూలీ ఆ వ్యాఖ్యలు చేశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌చేయండి: https://www.vaartha.com/telangana/