20నుంచి ఐఎస్‌ఎల్‌ షురూ

టోర్నీ షెడ్యూల్‌ విడుదల

ISL Football Tournament Schedule
ISL Football Tournament Schedule

పనాజి : ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ నవంబర్‌ 20న కేరళ బ్లాస్టర్స్‌-ఎటికె మోహన్‌బగాన్‌ జట్ల మధ్య పోరుతో ఆరంభం కానున్నది.

ఈ మేరకు నిర్వాహకులు టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. గోవాలోని మూడు స్టేడియంలలో ఈ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు.

ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌లను సాయంత్రం 5గం., రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తారు.

ఈ ఏడాది కోల్‌కతాకు చెందిన మేటి జట్లు మోహన్‌బగాన్‌, ఈస్ట్‌బెంగాల్‌ కూడా లీగ్‌లో పాల్గొననున్నాయి. లీగ్‌ పోటీలు నవంబర్‌నుంచి ఫిబ్రవరివరకు జరుగనున్నాయి.

సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ పోటీల తేదీలను తరువాత ప్రకటిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/