ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది


భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ

mohammed shami

కోల్‌కతా: టీమింమియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌షమీ తన జీవితంలో అత్యంత భాధాకరమయిన రోజుల గురించి తెలిపాడు. తాజాగా రోహిత్‌శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడిన షమీ పలు విషయాలు వెల్లడించాడు. 2015 ప్రపంచకప్‌ తర్వాత తన కేరీర్‌ చాలా ఒడిదుడుకులకు గురయిందని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో గాయాలపాలైన నేను కోలుకోవడానికి ఏడాదిన్నర పట్టింది. ఆ సమయంలో వ్యక్తిగత సమస్యలు అధికమవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. ఆ సమయంలో మూడు సార్లు ఆత్మహత్యకు పాల్పడాలన్న ఆలోచన వచ్చిన తన కుటుంబ సభ్యల అండతో తాను ఆ గడ్డు పరిస్థితి నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో నా కుటుంబ సభ్యలు మద్దతు ఇవ్వకపోయింటే నేను ఏదో ఒక తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/