ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి మరొక న్యాయమా?

టిడిపి ఎంపి కేశినేని నాని

kesineni nani
kesineni nani

అమరావతి: విశాఖలో నిన్న జరిగిన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు, దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహరం ప్రకటించారు. దీనిపై టిడిపి ఎంపి కేశినేని నాని ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. గోదావరి నది బోటు ప్రమాదంలో మరణించిన వారి కటుంబాలకు కూడా కోటిరూపాయలు ఇచ్చి వుంటే బావుండేది కదా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు అయినా ఆ కుటుంబాలకు బ్యాలన్స్‌ అమోంట్‌ ఇవ్వండి ప్రజలందరినీ సమానంగా చూడాలి గాని, ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం ఉండకూడదు అంటూ కేశినేని నాని ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/