రష్యాను అతలాకుతలం చేస్తున్న కరోనా

రష్యాలో ఇప్పటి వరకు 1,77,160 కరోనా కేసులు

coronavirus -russia
coronavirus -russia

రష్యా: కరోనా వైరస్‌తో రష్యా అతలాకుతలం అవుతోంది.గత వారం పదిరోజులుగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్‌ మిషూస్టిన్, సాంస్కృతిక మంత్రి ఓల్గా లూంబిమోవాస్, గృహనిర్మాణ మంత్రి వ్లాదిమర్‌ యకుషేవ్‌లును కూడా వైరస్ వదల్లేదు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా రష్యాలో ఇప్పటి వరకు 1,77,160 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో సగానికి పైగా కేసులు ఒక్క రాజధాని మాస్కోలోనే నమోదు కావడం గమనార్హం. 1625 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భయపడుతున్న ప్రజలు మాస్కోను వీడుతున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికిపైగా రాజధానిని వీడారు. కాగా కరోనా వైరస్‌ నియంత్రణ అన్ని దేశాల కంటే ముందున్న రష్యా లాక్‌డౌన్‌ విషయంలో ఆలస్యం చేయడమే ఆ దేశం కొంప ముంచింది. రోజురోజుకు వందల సంఖ్యతో పెరుగుతున్న కేసులతో రష్యా ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో జర్మనీ, ఫ్రాన్స్‌లను కూడా దాటేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/