ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకు ప్రమాదం

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన కాన్వాయ్ తో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా వెళ్లున్న ఎమ్యెల్యే కాన్వాయ్ ని బీఆర్ఎస్ కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు కారు వేగంగా ఢీ కొట్టింది.

దీంతో కౌన్సిలర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.