ఆయుర్వేద సంస్థలను ప్రారంభించిన ప్రధాని

PM Modi inaugurates Institute of Teaching and Research in Ayurveda at Jamnagar & National Institute

విశాఖ: ప్రధాని నరేంద్రమోడి ఆయుర్వేద దినోత్సవం సందర్భగా జామ్‌ నగర్‌లోని ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐటీఆర్‌ఏ), జైపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఎన్‌ఐఏ)లను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘ఆయుర్వేదం వైద్యప్రపంచంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అల్లోపతి, ఆయుర్వేద పద్ధతులు మన ప్రాచీన భారతదేశం యొక్క 21వ శతాబ్దపు శాస్త్రంతో కలిసిపోతాయి. ఇప్పుడు మీరందరూ దేశం యొక్క అగ్రశ్రేణి ఆయుర్వేద కేంద్రంలో భాగం కావడంతో మీ బాధ్యత మరింత పెరిగింది. మీరు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సిలబస్‌తో ముందుకు రావాలి’ ప్రధాని పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/