సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా SSMB28 లుక్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా మహేష్ బాబు నటిస్తున్న 28 వ మూవీ తాలూకా లుక్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో SSMB28 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడం తో దీనిపై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..ఈరోజు మే 31వ తేదీన కృష్ణ జయంతి సందర్బంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో మహేష్ బాబు ఎర్ర తుండువాను నెత్తి కి కట్టుకొని చాలా సీరియస్ లుక్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. లుక్ అయితే మాస్ తరహాలో ఉంది అని బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అని ఫాన్స్ అయితే పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని సాంగ్స్ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక సినిమా ను 2024 సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు. మహేష్ బాబు కు జోడి గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.