భారతీయులపై చైనా నిపుణుడి కీలక వ్యాఖ్యలు

భారతీయుల్లో మానసిక ఇమ్యూనిటీ ఎక్కువ

బీజింగ్‌: భారత్‌పై చైనాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన విద్యార్థులతో వీడియో క్లాసులో మాట్లాడుతూ…. భారత్ లోని ప్రజల్లో శారీరక వ్యాధి నిరోధక శక్తి తక్కువ అని, కానీ వారిలో మానసిక ఇమ్యూనిటీ ఎక్కువ అని వ్యాఖ్యానించారు.’భారత్ లో జరిగిన ఓ మతపరమైన సమావేశానికి హాజరైన ప్రజల్లో ఎవరూ మాస్కులు ధరించి కనిపించకపోవడాన్ని వార్తల్లో చూశాను. భారతీయులు మానసికంగా ఎంతో దృఢమైన వాళ్లు అన్న విషయం అప్పుడే అర్థమైంది. వారిది ప్రశాంత మనస్తత్వం. ఓవైపు అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరిగిపోతున్నా, భారత్ లో అంత తీవ్రత కనిపించడంలేదు. భారత్ లో కరోనా ఇన్ఫెక్షన్ శాతం 10కి మించదు. భారత్ లోని 90 శాతం ప్రజలను కరోనా ఏమీచేయలేకపోవచ్చుఖి అని వివరించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/