నాలుగు రోజులపాటు పూర్తి లాక్‌డౌన్‌

తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం

palani swamy
palani swamy

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తుంది. చెన్నై, కోయంబత్తురు, మధురై ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సిఎం పళని స్వామి తెలిపారు. ఈ నెల 26నుండి 29 వరకు ఇది అమలులలో ఉంటుందని తెలిపారు. అలగే సేలం తిరుప్పూరు ప్రాంతాలకు కూడా ఈ నిబందనలు వర్తిస్తాయని అన్నారు. కేవలం పండ్లు, కూరగాయలు తెచ్చే మొబైల్‌ వాహనాలు తప్ప మిగిలిన అన్ని దుకాణాలను మూసే ఉంచాలని ముఖ్యమంత్రి అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/