కరీంనగర్ లో దారుణం : 69 ఏళ్ల వృద్ధురాలి ఫై 29 ఏళ్ల యువకుడు లైంగిక దాడి

దేశ వ్యాప్తంగా మహిళలకు , ఒంటరి ఆడవారికి , ఆఖరికి అభం శుభం తెలియని చిన్నారులకు రక్షణ లేకుండా అయిపోతుంది. ఓ పక్క కోర్ట్ లు , చట్టాలు , పోలీసుల కఠిన శిక్షలు ఇలా అన్ని విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు కామంతో కళ్లుమూసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిలాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 69 ఏళ్ల వృద్ధురాలి ఫై 29 ఏళ్ల యువకుడు లైంగిక దాడి చేసి సభ్య సమాజం తలదించుకునేలా చేసాడు.

కరీంనగర్ జిల్లాలో బట్టల వ్యాపారం చేసే అయిలేష్ అనే యువకుడు.. ఇటీవల తమ బంధువుల వివాహ వేడుక కోసం కోహెడ అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ పీకలదాకా తాగి… పక్కింటి వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కామ వాంఛను తీర్చుకునేందుకు… వయసుతో సంబంధం లేకుండా… ఆ వృద్ధురాలిపై చెలరేగిపోయాడు. అయితే ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని.. ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అయిలేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.