మందు బాబులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుండగా..తాజాగా మందుబాబులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక ఫై హైదరాబాద్ లో అర్ధరాత్రి 12 గంటల వరకు బార్ & రెస్టారెంట్ ల ఓపెన్ కు అనుమతి ఇచ్చింది. అలాగే వీకెండ్ రోజుల్లో ఒంటిగంట వరకు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రకటన మందుబాబులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

తెలంగాణ సర్కార్ కు మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ లో ఎక్కువగా మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అందుకే ప్రభుత్వం ఎప్పటికప్పుడు మద్యం అమ్మకాల విషయంలో తీపి కబుర్లు తెలుపుతుంటుంది. ప్రతినెల రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గత మార్చి నెలలో రూ. 2814 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, ఇందులో నెల ఆఖరి రోజున రూ.307 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

గత ఏడాది డిసెంబర్ తర్వాత మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బార్ షాప్ లో పని వేళలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఖజానాకు మద్యం ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని అంత భావిస్తున్నారు. మరి కేవలం హైదరాబాద్ వరకే ఈ టైమింగా.. మిగతా ప్రాంతాల్లో కూడా పొడగిస్తారా అనేది చూడాలి.