ఏపీలో ‘అఖండ’ ప్రదర్శిస్తున్న థియేటర్స్ సీజ్…

ఏపీలో 'అఖండ' ప్రదర్శిస్తున్న థియేటర్స్ సీజ్…

బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఈరోజు (డిసెంబర్ 02) వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఏపీలో అఖండ ప్రదర్శిస్తున్న థియేటర్ ను సీజ్ చేసారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇవాళ తెల్లవారు జామున ఎనిమిది గంటలకు బెనిఫిట్ షో వేశారని మైలారం లోని సంఘమిత్ర థియేటర్ ను స్థానిక ఎమ్మార్వో సీజ్ చేశారు. అనుమతి లేనిదే ఎలా బెనిఫిట్ షోలు వేస్తారని.. థియేటర్ పై కేసులు నమోదు చేస్తామని ఎమ్మార్వో ఈ సందర్భంగా హెచ్చరించారు.

రెండు స్క్రీన్లలో… రూల్స్ బ్రేక్ చేసిన స్క్రీన్ ను మాత్రమే సీజ్ చేశామని తెలిపారు. రీసెంట్ గా ఏపీ సర్కార్ జీవో 35 ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం బెనిఫిట్ షో కు అనుమతి లేదని తేల్చి చెప్పింది. కేవలం రోజుకు నాల్గు షోస్ మాత్రమే ప్రదర్శన చేయాలనీ , ప్రభుత్వం ఫిక్స్ చేసిన ధరలకే టికెట్ అమ్మాలని రూల్ పెట్టింది. ఇక తెలంగాణ లో మాత్రం ప్రస్తుతం ఉన్న టికెట్ కంటే ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చని తెలపడమే కాదు బినెఫిట్ షోస్ కు సైతం అనుమతి ఇచ్చింది. ఈరోజు హైదరాబాద్ లోని రెండు థియేటర్స్ లలో అఖండ బినెఫిట్ షో వేయడం జరిగింది.