అర్ధ రాత్రి వేళ వైకాపా , తెదేపా కార్యకర్తల ఘర్షణ

తెదేపా నేత ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం- పరస్పర దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)”: పెదనందిపాడు పరిధిలోని కొప్పరు గ్రామంలో జరిగిన గణేష్ విగ్రహాల నిమజ్జనం ఊరేగింపులో వైకాపా , తెదేపా కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. ఈనేపథ్యంలో సేకరించిన వివరాల ప్రకారం టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ వేణు ఇంట్లోకి కొందరు వైకాపా కార్యకర్తలు వెళ్లి అడ్డు వచ్చిన వారిపై దాడి చేసారు. ఫర్నిచర్ ను పెట్రోల్ పోసి తగలబెట్టారు. బైక్ లను తగలబెట్టారు. ఒకదశలో ఇరువర్గాలు పరస్పరం కర్రలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా అంబులెన్సు లో హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో 40 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

Clash between TDP and YSRCP activists: bike set on fire

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/