రైతులకు తెలంగాణ సర్కార్ భారీ షాక్ ..

రైతులకు తెలంగాణ సర్కార్ భారీ షాక్ ..

తెలంగాణ రాష్ట్ర రైతులకు కేసీఆర్ సర్కార్ షాక్ ఇచ్చింది. పంట రుణాలపై మాఫీని ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. కేసీఆర్ రీసెంట్ గా దళిత బంధు ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకానికి నిధులు సర్దుబాటు కాకపోవడం వల్లే రెండో విడత రుణ మాఫీ తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఇక ఆగస్ట్ 16 నుండి 26 వరకు నగదు బదిలీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నిధులను విడుదల చేయలేదు. దాంతో రూ.50 వేల లోపు రుణ మాఫీ కి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

తొలి ఏడాది నిధులు సర్దుబాటు కాకపోవడం తో వాయిదా పడగా…కరోనా వల్ల వచ్చిన సంక్షోభం కారణంగా మరో ఏడాదిన్నర వాయిదా వేశారు. ఇదిలా ఉండగా రుణమాఫీ సమయానికి అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటం..మళ్ళీ పంటలు వేసేందుకు చేతిలో డబ్బులు లేకపోవడం తో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రైతులకే కాదు పెన్షన్ దారులకు కూడా తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. రెండు నెలలు కావొస్తున్నా ఇంకా నెల పెన్షన్ అందకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. పెన్షన్ మీదనే జీవనం గడిపే వారంతా రెండు నెలలుగా డబ్బులు లేకపోవడం తో తినడానికి కూడా ఏమి లేవని ..త్వరగా పెన్షన్ వెయ్యాలని కోరుతున్నారు.