చంద్రబాబు రింగ్ ఫై జగన్ సెటైర్లు..

చంద్రబాబు రింగ్ ఫై ఏపీ సీఎం జగన్ సెటైర్లు వేశారు. గత వారం రోజులుగా చంద్రబాబు రింగ్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. బాబు చేతికి ఉన్న రింగ్ వెనుక పెద్ద రహస్యమే ఉందని ప్రచారం కాగా..ఆ ప్రచారాన్ని ఖండించారు బాబు. రింగ్ లో చిప్ కంప్యూటర్‌తో అనుసంధానించిన మైక్రో చిప్ ఉందని , తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో పంపుతుందని, హార్ట్ బీట్‌ను, నిద్రిస్తున్న తీరును నమోదు చేస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు చెప్పిన రింగ్ చిప్ ఫై ప్లీనరీ వేదిక ఫై జగన్ సెటైర్లు వేశారు. చిప్ ఉండాల్సింది వేళ్లకు కాళ్లకు కాదంటూ ..చిప్ ఉండాల్సింది మెదడులో, గుండెలో అన్నారు.

ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్‌ చంద్రబాబుకు లేదని జగన్‌ మండిపడ్డారు.. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదని, పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానమన్నారు. ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతమని, తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తారని, పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలనేది చంద్రబాబు అభిమతమని జగన్‌ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ తీసుకెళ్లడానికి శ్రమిస్తోందని స్పష్టం చేశారు.