బిగ్ బ్రేకింగ్: సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

రైల్వే ట్రాక్‌పై విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ్డ రాజు
రెండు చేతుల‌పై మౌనిక అని ప‌చ్చ‌బొట్టు

హైదరాబాద్ : హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌, సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల బాలిక అఘాయిత్యానికి పాల్ప‌డ్డ నిందితుడు రాజు ఘ‌ట్‌కేస‌ర్ రైల్వే ట్రాక్‌పై విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ్డాడు. అత‌డు రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అత‌డి రెండు చేతుల‌పై మౌనిక అని ఉండే ప‌చ్చ బొట్టుతో అది అత‌డి మృత‌దేహ‌మేన‌ని స్ప‌ష్ట‌మైంది.

కాగా, గ‌త ఏడు రోజుల నుంచి రాజు క‌నిపించ‌కుండా పోయిన విష‌యం తెలిసిందే. రాజును ప‌ట్టుకునేందుకు 70 బృందాల‌ను పోలీసులు రంగంలోకి దించారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజు ఆచూకీ కోసం పోలీసులు జ‌ల్లెడ ప‌ట్టారు. ఈ నెల 9వ తేదీన సైదాబాద్‌లో చిన్నారిపై రాజు హ‌త్యాచారం చేశాడు. నాటి నుంచి రాజు క‌నిపించ‌కుండా పోయాడు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా చేప‌ట్టారు. ఇక అన్ని వైన్ షాపుల వ‌ద్ద నిందితుడు రాజు ఫోటోను ఉంచి నిఘా పెట్టారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 ల‌క్ష‌లు రివార్డు ఇస్తామ‌ని పోలీసులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/