వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు : జనసైనికులకు నాగబాబు విజ్ఞప్తి

ysrcp-nagababu-message-to-janasena-leaders

అమరావతి: జనసేన పార్టీ నాయకులు, మెగా బ్రదర్‌ నాగబాబు వైసీపీ పార్టీకి జవార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని కోరారు నాగబాబు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. ఈ మేరకు కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

‘వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది’ అని Xలో నాగబాబు వీడియో రిలీజ్ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడుతారా..? వైసిపి నేతలంతా కూటమీ గెలుస్తూందని బెట్టింగ్ వేస్తున్నారన్నారు ఎద్దేవా చేశారు. రోజా గెలుస్తూందని కనీసం రోజా అయినా బెట్టింగ్ వేస్తుందా..అంటూ పరువు తీశారు.