నాకు ప్రాణహాని ఉంది..ఉండవల్లి శ్రీదేవి

సందీప్, సురేశ్ అనే వ్యక్తులతో ముప్పు ఉందని వెల్లడి

undavalli sridevi
undavalli sridevi

అమరావతి: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సిపి మహిళా నేత ఉండవల్లి శ్రీదేవి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. సందీప్, సురేశ్ అనే వ్యక్తుల నుంచి తనకు ముప్పు ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సందీప్, సురేశ్ ఇటీవలే వైఎస్‌ఆర్‌సిపి నుంచి సస్పెన్షన్ కు గురయ్యారని, పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న కక్షతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు చేసిన ఫిర్యాదు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఆమె ఎవరిపై ఆరోపణలు చేశారో… సదరు వ్యక్తులు గతంలో ఎమ్మెల్యే అనుచరులే అన్న ప్రచారం ఉంది. శృంగారపాటి సందీప్‌, చలివేంద్ర సురేష్‌ ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంలోనే ఉండి.. నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలున్నాయి. అధికారుల బదిలీలు,నిరుద్యోగుల నుంచి డబ్బుల వసూళ్లు.. ఇలా వారిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో… ఇక ఆ ఇద్దరినీ పక్కనపెట్టేయాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే.. వీరిపై సస్పెన్షన్ వేటు వేయాలని స్వయంగా సిఫారసు చేశారన్న ప్రచారం ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/