జపాన్‌ దీవుల్లో భారీ భూకంపం

Earthquake

టోక్యో: ఈరోజు ఉదయం జపాన్ దేశంలోని చిచిజిమా సమీపంలోని దీవిలో భారీ భూకంపం సంభవించింది. జపాన్ రాజధాని నగరమైన టోక్యోకు 600 మైళ్ల దూరంలో ఉన్న ఒగాసవరా ద్వీపసమూహంలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2గా నమోైదందని జపాన్ వాతావరణ శాఖ (జేఎంఏ) వెల్లడించింది. భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భూకంపం వల్ల ఆస్తి, ప్రాణనష్టం వివరాలు కూడా తెలియలేదు. జపాన్ దేశం భూకంప క్రియాశీల జోన్ లో ఉంది. దీంతో ఇక్కడ తరచూ శక్తివంతమైన భూకంపాలు వస్తుంటాయి.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/