‘యధా రాజా తథా చంద్రబాబు’: రోజా

అమరావతి: వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపైవిమర్శలు గుప్పించారు. చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రా.. లేక వీధి రౌడీనా? అని అన్నారు. ముందు ‘యధా రాజా తథా ‍ప్రజా’ అంటారని, అయితే ఇప్పు‍డు ‘యధా రాజా తథా చంద్రబాబు’ అన్నది టీడీపీకి, చంద్రబాబుకే సరిపోతుందని పేర్కొన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా చేసి ఈ రోజు జగన్‌మోహన్ రెడ్డి నీరు ఇవ్వలేదని విమర్శించడం ఎక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. కుప్పంలో కనీసం ఇళ్లు,

కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి నేడు ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదం అని చెప్పారు. సిగ్గు లేకుండా కుప్పానికి రండి తేల్చుకుందాం అని పిలుస్తున్నారని మండిపడ్డారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని రోజా అన్నారు. గత వారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలని నమ్మించాలని చూస్తే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగన్‌మోహన్‌ రెడ్డికే పట్టం కడతారనే విషయాన్ని చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని రోజా హితవు పలికారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/