ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్‌ను క్షుణ్ణంగా చదవండి
ఐటీ నోటీసులతో టిడిపి నేతలకు భయం పట్టుకుంది

తాడేపల్లి: ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్‌నోట్‌ను క్షుణంగా చదివితే అసలు బండారం బయటపడుతుందని
వైఎస్సార్సిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి బాగోతంపై ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతో టిడిపి నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. ప్రెస్‌నోట్‌లో రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరగాయని పేర్కొంటే.. ఎక్కడ రెండువేల కోట్లు ఉన్నాయని యనమల రామకృష్ణుడు అంటున్నారని దుయ్యబట్టారు. యనమలను స్వయం ప్రకటిత మేధావిగా అమర్నాథ్ అభివర్ణించారు. యనమలకు పంటి నొప్పితో పాటు కంటి చూపు కూడా పోయిందని అన్నారు. ఐటీ ప్రెస్ నోట్ ఇచ్చింది వైఎస్సార్సీపీ కాదని..కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. రెండు వేల కోట్ల టర్నోవర్ లేని కంపెనీలు పెట్టి ఆర్థిక లావాదేవీలు జరిపారని స్పష్టంగా ప్రెస్ నోట్లో ఐటీ అధికారులు పేర్నొన్నారని అన్నారు. ఐటీ దాడులపై చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/