గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

కెసిఆర్‌ తన క్యాబినేట్‌లో ఒక్క దళితునికి కూడా మంత్రి ఇవ్వలేదు!

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణలో గిరిజనులు, ముస్లింలను మోసం చేశారని కాంగ్రెస్‌ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. నేడు గిరిజనుల రిజర్వేషన్ల అంశంపై ఉత్తమ్‌ స్పందించారు. గతంలో దివంగత ఎన్టీరామారావు ఎలాంటి కమిషన్‌ వేయకుండానే గిరిజనులకు రిజర్వేషన్లు 5 నుంచి 6 శాతానికి పెంచారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పిన కెసిఆర్‌ తన క్యాబినెట్‌లో ఒక్క దళితునికి కూడా మంత్రి ఇవ్వలేదని దుయ్యబట్టారు. ముస్లింల రిజర్వేషన్ల అంశాన్ని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఒక్కరోజు కూడా మాట్లాడలేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/