వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆదిమూలంకి కరోనా

తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

Koneti Adimulam

అమరావతి: ఏపిలో మరో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సత్యవేడు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆదిమూలంకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కరోనాకు చికిత్స అందుతోందని తెలిసింది. కాగా, ఇప్పటికే ఏపి‌లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకోగా, మరి కొందరు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుని కోలుకున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/