‘ఢీ’ ఫ్యామిలీలో విషాదం .గొప్ప డాన్సర్ ను పోగొట్టుకుంది

‘ఢీ’ ఫ్యామిలీలో విషాదం .గొప్ప డాన్సర్ ను పోగొట్టుకుంది

ఈటీవీ లో ‘ఢీ’ డాన్స్ షో గురించి చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంట్ డాన్సర్స్ పరిచయం అవుతున్నారు. వీరి డాన్స్ చూసి ఎంతోమంది డాన్సర్స్ అవుతున్నారు. చిత్రసీమలోను మంచి అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తున్నారు. అలాంటి ‘ఢీ’ ఫ్యామిలీ మంచి డాన్సర్ ను పోగొట్టుకుంది.

‘ఢీ’ లో యశ్ మాస్టర్ టీంలో కంటెస్టంట్‌గా అలాగే కొద్ది కాలం యశ్ మాస్టర్ అసిస్టెంట్‌గా కూడా పని చేసిన కేవల్ మృతిచెందాడు. కేవల్ కొద్దికాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. అతడిని బతికించడానికి అవసరమైన బ్లడ్ అందిచండి.. అందరూ సాయం చెయ్యండని యశ్‌తో ‘ఢీ’ కంటెస్టంట్స్ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. సరైన వైద్యం అందక ఆరోగ్యం విషమించడంతో కేవల్ మరణించాడు. తన అసిస్టెంట్ కోసం యశ్ మాస్టర్ కూడా ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను.. ఈ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.. చాలా తర్వగా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావ్ అంటూ.. హాస్పిటల్‌లో కేవల్‌తో తీసుకున్న సెల్ఫీని షేర్ చేస్తూ భావేద్వేగభరితమైన పోస్ట్ చేశారు యశ్ మాస్టర్.