సీఎం స్టాలిన్ బస్సులో ప్రయాణం..పాలనపై ప్రయాణికుల నుంచి ఆరా

ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం స్టాలిన్.. ఐదు ప్రకటనలు

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో నేడు ప్ర‌భుత్వ బ‌స్సులో ప్ర‌యాణించారు. మెరీనా బీచ్‌లో ఉన్న క‌రుణానిధి స్మార‌కం, అన్నా మెమోరియ‌ల్‌కు చేరుకునేందుకు స్టాలిన్ బ‌స్సులో ట్రావెల్ చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. తన ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఏమనుకుంటున్నారు? అంటూ బస్సు కండక్టర్, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వ బ‌స్సుల ప‌నితీరును త‌నిఖీ చేశారు. ప్రయాణికులు, కండక్ట‌ర్‌తో ముచ్చ‌టించారు. బ‌స్సు సౌక‌ర్యాల‌పై ఆయ‌న అడిగి తెలుసుకున్నారు.

మెరీనా బీచ్ బ‌స్సులో చేరుకున్న సీఎం స్టాలిన్‌.. అక్క‌డ ఉన్న మాజీ సీఎం క‌రుణానిధి స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు. డీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఎం సీఎన్ అన్నాదురై మెమోరియ‌ల్ వ‌ద్ద పుష్ప‌గుచ్ఛంతో నివాళి అర్పించారు. ఆ త‌ర్వాత అసెంబ్లీలో సీఎం స్టాలిక్ అయిదు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ప్ర‌భుత్వ స్కూల్ల‌లో ఒక‌టి నుంచి 5వ త‌ర‌గ‌తి పిల్ల‌ల కోసం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్ర‌క‌టించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌, మెడిక‌ల్ చ‌క‌ప్‌, ప‌ట్ట‌ణ కేంద్రాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుపై ప్ర‌క‌ట‌న చేవారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం అన్న స్కీమ్‌ను కూడా ప్ర‌క‌టించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/