ఎదురుకాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి

భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు

Firing between Maoists and security forces
Firing between Maoists and security forces

Chhattisgarh: భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి . బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని తెర్రం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ జరుపుతున్న జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోలు ఈ చర్యకు పాల్పడ్డారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 24కి పెరిగింది. నక్సల్స్ దాడిలో 31 మంది జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/