మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఈ నెలలోనే కోనెయ్యండి..ఎందుకంటే

మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఈ నెలలోనే కోనెయ్యండి..ఎందుకంటే

ఓ చక్కటి సొంతల్లు కట్టుకోవాలని , ఓ కారు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈరోజుల్లో కారు ధరలు కూడా చాల చౌకగా ఉండడం తో చాలామంది మధ్యతరగతి వారు సైతం కారు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కార్ల కంపెనీ వారు కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్ ఇవ్వబోతున్నారు. వచ్చే నెల నుండి కార్ల ధరలను భారీగా పెంచాలని చూస్తున్నారు.

జనవరి నుంచి కార్ల రేట్లు పెంచడానికి డిసైడ్ అయ్యాయి. ఇప్పటికే మారుతి సుజుకి, ఆడి, బెంజ్ కార్ల కంపెనీలు తమ కార్లపై ధరలను పెంచాలాని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఇదే బాటలో మరికొన్ని కార్ల కంపెనీలు కూడా తమ ఉత్పత్తులపై ధరలను పెంచనున్నాయి. టాటా మోటార్స్, హోండా, రెనో కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకోనున్నాయి. కార్లపై 2-3 శాతం మేర రేట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది. మారుతీ సుజుకి ఇండియాతో పాటు లగ్జరీ కార్ల తయారీదారులు మెర్సిడెస్-బెంజ్, ఆడి కంపెనీలు పెరుగుతున్న ఇన్‌పుట్ మరియు ఫీచర్ మెరుగుదల ఖర్చులను భర్తీ చేయడానికి జనవరి నుండి ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్ మరియు విలువైన లోహాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కంపెనీ ధరలను పెంచాల్సి వస్తుందని కార్ల కంపెనీలు చెబుతున్నాయి. అందుకే ఎవరైనా కొత్తగా కారు కొనాలని అనుకుంటే ఈ నెలలోనే తీసుకోండి.