టికెట్ల కేటాయింపుపై వైఎస్‌ఆర్‌సిపి లో అసంతృప్తి

విశాఖలో వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయం ఎదుట ఆందోళన

YSRCP Visakhapatnam
YSRCP Visakhapatnam

విశాఖ: టికెట్ల కేటాయింపు పై వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఈ విషయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విశాఖ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గెలిచే అవకాశం ఉన్నవారికి, ఎప్పటినుంచో పార్టీ జెండాలు మోసే వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కనబరుస్తున్నారు. పార్టీ కోసం పాటుబడిన వారిని కాదని నాయకులు కటుంబ సభ్యులు, బంధువులనే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అధినాయకులు జోక్యం చేసుకోకపోతే పార్టీ మనుగడ కష్టంగా మారుతుందని వాపోతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని, కాదని ఇలాగే ముందుకు వెళితే పార్టీ మునగడం ఖాయమని హెచ్చరించారు. టికెట్ల కేటాయింపుపై పున:పరిశీలన చేసి, గెలిచేవారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/