వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నుండి మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన ..

తెలంగాణ లో షర్మిల స్థాపించిన వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నుండి మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి ను షర్మిల ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకరావాలని షర్మిల ..రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీ ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న వస్తున్న ఈమె..ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో షర్మిల దళిత భేరి బహిరంగ సభ నిర్వహించారు.

ఈ స‌భ‌లో మాట్లాడుతూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా వైటీపీ త‌ర‌పున తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఏపూరి సోమ‌న్న పోటీకి దిగుతార‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. తుంగ‌తుర్తి ప్ర‌జ‌లు ఏపూరి సొమ‌న్న‌ను ఆశిర్వ‌దించాల‌ని ష‌ర్మిల కోరారు. అలాగే కేసీఆర్ ఫై కూడా షర్మిల ఫైర్ అయ్యారు.

హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఉన్నందునే దళిత బంధు పథకం తెచ్చానని నిస్సిగ్గుగా కేసీఆర్ చెప్పారని.. దాన్ని బట్టే ప్రేమ దళితులపైనా? ఎన్నికల మీదనా? అనేది తేలిపోతుందని అన్నారు. వైఎస్ హాయాంలో సిద్దిపేట జిల్లాలో భూ పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్ కట్టాలని దళితుల భూములను లాగేసుకున్నారు. రైతు వేదిక కట్టేందుకు కూడా దళితుడి భూమినే లాగేసుకున్నారు. కేసీఆర్ భూములు ఎందుకు ఇవ్వలేడు? పేదలు, దళితుల భూములే ఎందుకు లాక్కుంటున్నారు. ఇప్పుడు భూ బ్యాంకులు పెడుతున్నారు. వేల ఎకరాలు జమ చేయడమే భూ బ్యాంకు. పెద్ద దొర కేసీఆర్, చిన్న దొర కేటీఆర్ ఇలా భూములను జమ చేసి తమ బినామీలకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. మీరు ఎంత భూమి స్వాహా చేస్తే మీ కడుపు నిండుతుందో చెప్పండి? మీ దురాశకు హద్దుల్లేవా? ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణను? ” అంటూ షర్మిల ప్రశ్నించారు.