మరికాసేపట్లో నవదీప్ ను విచారించబోతున్న ఈడీ

డ్రగ్స్ కొనుగోళ్లు… మనీ లాండరింగ్ కేసుల నేపథ్యంలో నోటీసులు అందుకున్న నవదీప్..మరికాసేపట్లో ఈడీ ఆఫీస్ కు రానున్నారు. ఈ కేసులో చిత్రసీమలో 12 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆ 12 మంది ని ఈడీ అధికారులు విచారించడం మొదలుపెట్టారు. ఇప్పటికే వరకు డైరెక్టర్ పూరి జగన్నాధ్ , ఛార్మి , రకుల్ , నందు, రానా , రవితేజ లను విచారించిన అధికారులు..ఈరోజు నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను విచారించనున్నారు.

ఈ ఇద్దరిని కలిపి ఈడీ ఈరోజు విచారించనుంది. అలాగే ఈరోజు మరోసారి విచారణకు రావాలని కెల్విన్ కి ఈడీ ఆదేశాలు ఇచ్చింది. అయితే మొత్తం ఈ కేసు ఎఫ్ క్లబ్ చుట్టూ తిరుగుతుంది. ఎఫ్ క్లబ్ మేనేజర్ ద్వారా కెల్విన్ నుండి చాలా మంది నటులు డ్రగ్స్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. దాంతో నేడు కెల్విన్, ఎఫ్ క్లబ్ మేనేజర్ ని సుదీర్ఘంగా విచారించనుంది. మరి ఈ విచారణ లో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.