లేవగానే బాలయ్య ఫోటో చూస్తానంటున్న పూర్ణ..

తన వయసు తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ మీడియాతో ముచ్చటించింది హీరోయిన్ పూర్ణ. ఇంటర్వ్యూ లో బాలకృష్ణ ఫై ఆసక్తికర కామెంట్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పిన పూర్ణ.. సెట్స్‌పై మొదటిసారి బాలయ్యను కలిసిన సమయంలో ఆయన రిసీవ్ చేసుకున్న విధానానికి ఫిదా అయ్యాయని తెలిపింది. ”ఓ రోజు నా ఫోన్ వాల్ పేపర్ మీ ఫొటో పెట్టుకుంటానని బాలయ్యకు చెప్పా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మీ ఫొటో చూస్తానని చెప్పా. ఎందుకంటే ఆ సింహం లాగే ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా రోజంతా పని చేయాలి కాబట్టి. బాలయ్య గారు ప్రతిరోజు సెట్స్‌కి వస్తారు. డైరెక్టర్ చెప్పింది చేస్తారు. బోయపాటి చెబుతుంటే ‘అలాగే.. అలాగే’ అనే మాట తప్ప ఆయన నోటినుంచి మరో మాటే రాకపోవడం చూశా. బాలయ్య లాంటి గ్రేట్ యాక్టర్‌తో మరిన్ని సినిమాలు చేసి మరింత స్ఫూర్తి పొందాలని ఉంది” అని తెలిపింది.