రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌..

,

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వెయ్యి..పదివేలు కాదు ఏకంగా మూడు లక్షల మంది అతిధులకు భోజనం ఏర్పాటు..బాహుబలి రేంజ్ లో భారీ సెట్టింగ్స్ .. 30 ఎకరాల్లో రిసెప్షన్‌ వేడుక ..కెనాల్‌పై రూ.కోటి వ్యయంతో బ్రిడ్జి..ఇలా భారీగా చేస్తున్నారు.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌ని ఈ నెల 17న ఖమ్మంలో అట్టహాసంగా జరపబోతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లికి ఆహ్వానించే క్రమంలోనే వివాహ పత్రికలతో పాటు గోడ గడియారాలను బహుమతిగా ఇచ్చి ఆకర్షించారు. వివాహ రిసెప్షన్‌ను ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ సమీపంలోని వంద ఎకరాల ప్రదేశంలో నిర్వహిస్తున్నారు. రిసెప్షన్ వేదిక 30 ఎకరాల్లో ఉండగా.. వందలాదిగా వచ్చే కార్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా సుమారు 3 లక్షల మంది అతిధులు భోజనం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రిసెప్షన్ వేదికపై బాహుబలి రేంజ్‌లో భారీ సెట్టింగులు నిర్మించడం విశేషం. వర్షాలు పడుతుండడం తో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ టెంపరరీ వాటర్‌ప్రూప్‌ షెడ్లను నిర్మిస్తున్నారు. అంతే కాదు వేడుకకు వచ్చే వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని కెనాల్‌పై రూ.కోటి వ్యయంతో బ్రిడ్జిని నిర్మించారు. ఐరన్‌తో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేశారు. ఇలా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రిసెప్షన్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.