టీ-సేఫ్ యాప్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

cm Revanth Reddy

హైదరాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం టీ-సేఫ్ ( T-SAFE) యాప్‌ను ప్రారంభించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్‌ను రూపొందించారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు ఇది అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ యాప్ ద్వారా మహిళల ప్రయాణ భద్రతను పోలీసులు పర్యవేక్షించవచ్చు. సచివాలయంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.