తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారత్‌బంద్‌

నేటి ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు బంద్

bharat-bandh

హైదరాబాద్‌: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్‌బంద్‌‌ తెలంగాణలో కొనసాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు నేడు తలపెట్టిన భారత్ బంద్‌కు 24 పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, టిఆర్‌ఎస్‌, ఎంఐఎం, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు ఉన్నాయి. భారత్‌బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోని ఆర్‌టీసీ బస్‌లు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జాము నుంచే డిపోల ఎదుట టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ నిర్వహించనున్నారు. కాగా, రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. రైతు సంఘాలతో ప్రభుత్వం రేపు మరోమారు చర్చలు జరపనుంది.

తెలంగాణలో కొనసాగుతున్న భారత్‌బంద్‌


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/