ట్యాంక్‌బండ్‌ పై ఆందోళన.. వైఎస్ షర్మిల అరెస్ట్

ys-sharmila-arrest-at-tank-bund-in-hyderabad

హైదరాబాద్ః నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు​ వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని ట్యాంక్​ బండ్​పై రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంక్​ బండ్ రోడ్డుపై దీక్షకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. అక్కడ దీక్షకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు ఆమెను అరెస్ట్​ చేసి బొల్లారం పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన షర్మిల.. కెసిఆర్​కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ముసుగులో లిక్కర్​స్కామ్​కు పాల్పడిందని ఆరోపించారు. మహిళల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కవితకు తప్ప ఎవరికీ భద్రత లేదన్నారు. విచ్చలవిడి మద్యం వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, దీనిపై కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ ​చేశారు.