96వ రోజుకు చేరుకున్న షర్మిల పాదయాత్ర

ఆటో నడిపి అందరినీ ఆకట్టుకున్న షర్మిల

హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 96వ రోజుకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం ఖమ్మం పాత బస్టాండ్ దగ్గర జరిగే భారీ బహిరంగ సభతో ఈ నాటి పాదయాత్ర ముగుస్తుంది. మరోవైపు ఈనాటి పాదయాత్రలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. షర్మిల ఆటోను నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డ్రైవరన్నల కష్టానికి ఫలితం దక్కే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. కర్షకులతో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యతను ఇవ్వడమే వైఎస్సార్టీపీ ధ్యేయమని అన్నారు.

https://twitter.com/realyssharmila/status/1537384893994262530

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/