బాసర ట్రిపుల్ ఐటీకి కొత్త డైరెక్టర్ ను నియమించిన ప్రభుత్వం

ఈ ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రిపుల్ ఐటీ అధికారులు… విద్యార్థుల హాస్టళ్లకు మంచి నీళ్ల సరఫరా బంద్ చేశారు. అధికారుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన విద్యార్థులు.. ఖాళీ నీళ్ల బాటిళ్లు చేతపట్టి, ‘వీ వాంట్ వాటర్’ అంటూ నినాదాలు చేశారు. అడుగడుగునా పోలీసులు, అధికారులు ఆంక్షలు పెట్టడంపై వారు మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు విద్యార్థులకు మద్దతుగా వచ్చిన తల్లిదండ్రులను కూడా బలవంతంగా బాసర పీఎస్ కు తరలించారు. ఈక్రమంలో పోలీసులు, పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. వివిధ పార్టీల నేతల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి.. విద్యార్థులెవరూ ట్రిపుల్ ఐటీ మెయిన్ గేటు దగ్గరకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల నిర్బంధంపై రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.