కడియం శ్రీహరి ఫై విమర్శలు చేసిన వైస్ షర్మిల

YSRTP అధినేత్రి వైస్ షర్మిల తన పాదయాత్రలో బిఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి , తాటికొండ రాజయ్యల ఫై విమర్శల వర్షం కురిపించింది. 14 ఏళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి కడియం చేసిందేమీ లేదని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్ట్‌తో ఘనపూర్‌కి వైస్సార్ సాగునీరు అందించారని షర్మిల గుర్తుచేశారు. తెలంగాణకు YSR వ్యతిరేకి అని కడియం శ్రీహరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించినందుకు వ్యతిరేకా? లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చినందుకు వ్యతిరేకా? 30 వేల ఇండ్లు ఇచ్చినందుకు వ్యతిరేకా? రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించినందుకు వైస్సార్ వ్యతిరేకా? అని నిలదీశారు.

14 ఏళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి.. ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదని ఆరోపించారు. జనగాంలోని కొన్ని మండలాల్లో ఇంటర్ కాలేజీలు కూడా లేవని విమర్శించారు. జనగాంకి పరిశ్రమలు వస్తాయి అన్నారు.. ఒక్కటీ కూడా రాలేదని దుయ్యబ్టటారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్​లో ఏర్పాటు చేసిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఇద్దరు నాయకులుండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. గజ్వేల్ ఎలా ఉంది..? స్టేషన్ ఘనపూర్ ఎలా ఉంది..? అని పేర్కొన్నారు.

MLA తాటికొండ రాజయ్య, MLC కడియం శ్రీహరి. ఇద్దరికీ ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ప్రజాసేవపై ధ్యాసే లేదని నిప్పులు చెరిగారు. రాసలీలల రాజయ్య అని శ్రీహరి అంటే.. ఎన్కౌంటర్ల శ్రీహరి అని రాజయ్య తిడతాడట. ఇద్దరూ దళిత నాయకులై ఉండి దళితుల సమస్యలపై ఏనాడూ నోరెత్తరని మండిపడ్డారు