ధమాకా నుంచి మరో సాంగ్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ మూవీ నుండి డు..డు అంటూ సాగే ప్రోమో సాంగ్‌ విడుదలైంది. మాస్ మహారాజా నటిస్తున్న కొత్త చిత్రాల్లో ధమాకా ఒకటి. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకోగా..ఈరోజు సినిమాలోని ‘డు..డు’ అంటూ సాగే సాంగ్ తాలూకా ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేసారు. దీని ఫుల్‌ సాంగ్‌ ను డిసెంబర్‌ 25న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.