సాంబార్ రుచిగా చేయలేదని తల్లీ, చెల్లిని చంపేశాడు

క్షణికావేశంలో చేసే పనులు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తాయి. ఎందరినో అనాధులను చేస్తాయి. తాజాగా ఓ నీచుడు సాంబార్ రుచిగా చేయలేదని తల్లిని , చెల్లిని చంపేశాడు. ఈ ఘటన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సిద్దాపుర తాలూకా కొడగోడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
చెందిన మంజునాథ్ అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకొని తల్లిని దూషించేవాడు. దసరా పండగవేళ కూడా ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భోజనం పెట్టమని అడగ్గా తల్లి భోజనం వడ్డించింది. మంజునాథ్ తనకు వేసిన సాంబార్ రుచిగా లేదని తల్లితో గొడవపడటంతో సోదరి కూడా మద్యలో మంజునాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో గొడవ జరగ్గా తల్లి పార్వతి సోదరి రమ్యలను నాటు తుపాకీతో కాల్చి చంపాడు. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నింధితున్ని అరెస్ట్ చేశారు.