దసరా ఉత్సవాల్లో విషాదం

దసరా ఉత్సవాల్లో విషాదం

చ‌త్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో దసరా ఉత్సవాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ‌స్థులు ద‌స‌రా పండుగ సంధ‌ర్భంగా అంతాక‌లిసి ఊరేగింపుగా త‌ర‌లివెళుతున్న‌ స‌మయంలో సడెన్ గా ఓ ఎస్ యూవీ వాహ‌నం వెనుక నుండి వారిపైకి దూసుకువ‌చ్చింది. అయితే ఆ వాహనంలో గంజాయిని త‌ర‌లిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. భారీగా వాహ‌నంలో గంజాయి ఉండ‌టంతో పోలీసులు ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దాంతో ఆ కార్ డ్రైవర్ పోలీసుల నుండి తప్పించుకునేందుకు వాహనాన్ని వేగంగా నడుపుతూ వచ్చాడు.

ఊరేగింపుగా వెళుతున్న సరే తన స్పీడ్ ను తగ్గించుకోకుండా వారిపైకి కారుతో దూసుకెళ్లాడు. దాదాపుగా 24 మందిని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెంద‌గా 20 మంది గాయ‌ప‌డ్డారు. ఇక ఊరేగింపును వీడియో తీస్తుండ‌గా యాక్సిడెంట్ కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.