ప్రేమను కాదందని .. కత్తితో పొడిచి చంపి.. ఆపై

ఆత్మా హత్యా యత్నం చేసుకున్న యువకుడిని కొట్టి చంపిన స్థానికులు

young man killed the young woman
young man killed the young woman

Chittor District: తన ప్రేమను నిరాకరిస్తోందని ఓ యువతిని చిన్నా అనే యువకుడు కత్తితో గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత తన గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించి పడిపోగా.. కోపోద్రిక్తులైన స్థానికులు బండరాళ్లతో కొట్టి చంపారు. చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో దారుణం జరిగింది. కండ్రిగ గ్రామానికి చెందిన సుష్మను ప్రేమ పేరుతో చిన్నా అనే యువకుడు వేధిస్తున్నాడు. ఇష్టం లేదని చెప్పినా.. వినకపోవడంతో చిన్నాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుష్మపై కక్ష పెంచుకున్న చిన్నా శుక్రవారం యువతి ఇంటికి వెళ్లి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం యువకుడు తనను తాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే పడిపోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురై బండరాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/