త్వరలో మరో ప్రముఖ లీడర్ రెడీ !
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి

Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీల్లో వాతావరణం వేడెక్కింది. త్వరలో మరో పెద్ద నాయకుడు బీజేపీలోకి రాబోతున్నారని ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలకు వర్చువల్ గా సమావేశం నిర్వహించిన ఆయన తమ పార్టీలోకి పెద్ద నాయకుడు రాబోతున్నారని, ఈటలకు మద్దతుగా ఉండాలని సూచించారు. దీంతో బీజేపీలోకి వెళ్లబోయే పెద్ద నాయకుడు ఎవరనే సస్పెన్స్ నాయకుల్లో నెలకొంది. కాగా , కాంగ్రెస్. టీఆర్ఎస్ నేతల్లో కూడా ‘బండి’ వ్యాఖ్యలపై చర్చ సాగుతూ ఉంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/